నన్ను ప్రేమించి మోసం చేశాడు: దర్శన్ పై సినీ నటి సనమ్ ఫిర్యాదు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నన్ను ప్రేమించి మోసం చేశాడు: దర్శన్ పై సినీ నటి సనమ్ ఫిర్యాదు

Actress Sanam complaints against his boy friend
  • 'బిగ్ బాస్ 3' ఫేమ్ దర్శన్ తో సనమ్ ప్రేయాయణం
  • ఏడాది తర్వాత దూరం పెట్టిన దర్శన్
  • చెన్నైలోని అడయార్ పోలీసులను ఆశ్రయించిన సనమ్
మలేసియా యువకుడు, తమిళ రియాలిటీ షో 'బిగ్ బాస్ 3' ద్వారా ఆకట్టుకున్న దర్శన్ తనను మోసం చేశాడంటూ తమిళ సినీ నటి సనమ్ శెట్టి వాపోయింది. దర్శన్ తనను ప్రేమిస్తున్నానని చెప్పి, మోసగించాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు చెన్నైలోని అడయార్ పోలీస్ స్టేషన్ లో ఆమె ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్శన్ కోసం గాలిస్తున్నారు.

సనమ్ శెట్టి తొలుత మోడల్ గా తన కెరీర్ ను ప్రారంభించింది. ఆ తర్వాత తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ చిత్రాల్లో నటించింది. కాలక్రమంలో ఆమెకు దర్శన్ తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారడంతో.. ఇద్దరూ ఏడాది పాటు రిలేషన్ షిప్ లో ఉన్నారు. ఆ తర్వాత ఏమైందో కానీ సనమ్ తో దర్శన్ బంధాలను తెంచుకున్నాడు. దీంతో సనమ్ పోలీసులను ఆశ్రయించింది.

తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి, మోసం చేశాడని తన ఫిర్యాదులో సనమ్ పేర్కొంది. అతడిని కఠినంగా శిక్షించాలని కోరింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్శన్ కోసం గాలిస్తున్నారు.
Sanam Shetty
Kollywood
Love
Tamil Bigg Boss

More Telugu News