Navneet Kaur: గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన ఎంపీ నవనీత్ కౌర్

Former actress and MP Navneet Kaur planted saplings in the part of Green India Challenge
  • చాలెంజ్ లో పాల్గొనడం పట్ల హర్షం వ్యక్తం చేసిన నవనీత్
  • అందరూ అవగాహన పెంచుకోవాలని సూచన
  • ఈ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని పిలుపు
మాజీ నటి, పార్లమెంటు సభ్యురాలు నవనీత్ కౌర్ గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటారు. రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ ఈ చాలెంజ్ ను ప్రారంభించడం గురించి తెలుసుకున్నానని, ఎంతోమంది ఈ చాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటడం చూస్తున్నానని, ఇప్పుడు తాను కూడా అందులో భాగమయ్యానని తెలిపారు. టాలీవుడ్ సహా దక్షిణాది చిత్రపరిశ్రమల ప్రముఖులు మొక్కలు నాటుతూ, ఈ కార్యక్రమంలో పాల్గొంటుండడం ఎంతో బాగుందని కితాబిచ్చారు.

పర్యావరణానికి ఉపయోగపడే ఈ కార్యక్రమాన్ని అందరూ ముందుకు తీసుకెళ్లాలని, ఈ చాలెంజ్ కు మద్దతు పలకాలని నవనీత్ కౌర్ అభిమానులకు పిలుపునిచ్చారు. మొక్కలు నాటడం పట్ల అవగాహన పెంచుకోవాలని, ఇవాళ తాను కొన్ని మొక్కలు నాటడం పట్ల ఎంతో సంతోషంగా ఉందని అన్నారు.
Navneet Kaur
Green India Challenge
Saplings
Santosh Kumar
Tollywood

More Telugu News