Thamanna: ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కరోనా వచ్చింది... ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అవుతున్నా: తమన్నా

Thamanna says that she is being discharged from hospital
  • గతవారం తమన్నాకు స్వల్ప జ్వరం
  • వైద్యపరీక్షల్లో కరోనా పాజిటివ్
  • హైదరాబాదులోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స
ప్రముఖ హీరోయిన్ తమన్నా కరోనా బారినపడిన సంగతి తెలిసిందే. దీనిపై ఆమె ఓ ప్రకటన చేశారు. సెట్స్ పై తాను, తన బృందం ఎంతో క్రమశిక్షణతో మెలిగినా, దురదృష్టవశాత్తు గతవారం స్వల్ప జ్వరం వచ్చిందని వివరించారు. దాంతో అవసరమైన వైద్య పరీక్షలు చేయించుకోగా, కరోనా పాజిటివ్ అని వెల్లడైందని తెలిపారు. అయితే, మరిన్ని అనారోగ్య సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు హైదరాబాదులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరానని తమన్నా వెల్లడించారు.

నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో స్వస్థత పొందానని, ప్రస్తుతం తనను డిశ్చార్జి చేస్తున్నారని వివరించారు. ఏదేమైనా ఈ వారం ఎంతో కఠినంగా గడిచిందని, కరోనా నుంచి కోలుకోవడం ఊరట కలిగిస్తోందని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమందిని పీడిస్తున్న ఈ మహమ్మారి వైరస్ నుంచి పూర్తిగా కోలుకుంటానని తాను ఆశావహ దృక్పథంతో ఉన్నానని తన ప్రకటనలో వివరించారు.

ప్రస్తుతం డాక్టర్ల సలహా మేరకు సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉండదలుచుకున్నానని, ఈ సమయంలో తన ఆరోగ్యం పట్ల ఆందోళన కనబర్చినవారికి, తనపై ప్రేమ చూపినవారికి ఆత్మీయ ఆలింగనాలు అంటూ పేర్కొన్నారు.
Thamanna
Corona Virus
Positive
Private Hospital
Hyderabad

More Telugu News