Harish Rao: రాష్ట్రాలను కేంద్రమే ఆదుకోవాలి: హరీశ్ రావు

  • జీఎస్టీ పరిహారం మొత్తాన్ని కేంద్రమే చెల్లించాలి
  • కరోనాతో రాష్ట్రాలు నష్టపోయాయి
  • ఆర్థిక మంత్రుల సమావేశంలో విన్నవించిన హరీశ్
Centre has to save states says Harish Rao

అన్ని రాష్ట్రాల ఆర్థికమంత్రులతో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ జీఎస్టీ కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ ఆర్థికమంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ, జీఎస్టీ పరిహారం మొత్తాన్ని కేంద్రమే చెల్లించాలని కోరారు. పరిహారం పొందడం రాష్ట్రాల చట్టబద్ధమైన హక్కని చెప్పారు.

ఈ ఏడాది ఆరు నెలల సెస్ వసూలు చేశారని, రాష్ట్రాలకు చెల్లించాల్సిన మూడు ఇన్స్టాల్ మెంట్లు ఇంకా పెండింగ్ లో ఉన్నాయని తెలిపారు. పెండింగ్ లో ఉన్న మొత్తాన్ని రాష్ట్రాలకు వెంటనే చెల్లించాలని కోరారు. జీఎస్టీ పరిహారం మొత్తాన్ని కేంద్రమే అప్పుగా తీసుకుని రాష్ట్రాలకు చెల్లించాలని విన్నవించారు. కరోనా కారణంగా రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి దారుణంగా తయారైందని... ఈ పరిస్థితుల్లో కేంద్రం నుంచి వచ్చే డబ్బు రాష్ట్రాలకు ఎంతో అవసరమని చెప్పారు.

More Telugu News