RCB: ఢిల్లీపై టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న రాయల్ చాలెంజర్స్

Royal Challemgers Banglore won the toss against Delhi Capitals
  • ఐపీఎల్ లో నేడు బెంగళూరు వర్సెస్ ఢిల్లీ
  • దుబాయ్ వేదికగా మ్యాచ్
  • తాజా సీజన్ లో రాణిస్తున్న ఇరుజట్లు
ఐపీఎల్ లో నేడు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య మ్యాచ్ కు సర్వం సిద్ధమైంది. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగే ఈ పోరులో టాస్ గెలిచిన బెంగళూరు జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. గత సీజన్లకు భిన్నంగా ఎంతో ఆశావహ దృక్పథంతో టోర్నీ ఆరంభించిన బెంగళూరు జట్టు ఇప్పటివరకు 4 మ్యాచ్ లు ఆడి 3 విజయాలతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. జట్టులో అందరూ రాణిస్తుండడం బెంగళూరుకు కలిసొస్తోంది.

కోహ్లీ ముందుండి నడిపిస్తూ తన సారథ్యంలో ఆటు సీనియర్లకు, ఇటు యువ ఆటగాళ్లకు దిశానిర్దేశం చేస్తున్నాడు. బెంగళూరు జట్టులో రెండు మార్పులు చోటుచేసుకున్నాయి. ఆడమ్ జంపా స్థానంలో మొయిన్ అలీ... గుర్ కీరత్ సింగ్ మాన్ స్థానంలో హైదరాబాదీ పేసర్ సిరాజ్ ఆడుతున్నారు. ఇక ఢిల్లీ జట్టు కూడా శ్రేయాస్ అయ్యర్ నాయకత్వంలో సత్తా చాటుతోంది. ఢిల్లీ జట్టు ఈ మ్యాచ్ కోసం ఓ మార్పుతో బరిలో దిగుతోంది. అమిత్ మిశ్రా స్థానంలో అక్షర్ పటేల్ తుదిజట్టులోకి వచ్చాడు.
RCB
DC
Toss
Dubai
IPL 2020

More Telugu News