Andhra Pradesh: ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసుల సంఖ్య.. అప్ డేట్స్ ఇవిగో!

Corona cases in AP is gradually reducing
షార్ట్స్‌లో చూడండి
ఏపీలో కొత్తగా నమోదవుతున్న కరోనా కేసుల సంఖ్య భారీగా తగ్గుతోంది. గత 24 గంటల్లో 4,256 కొత్త కేసులు మాత్రమే నమోదయ్యాయి. కర్నూలు జిల్లాలో అత్యల్పంగా 86 కేసులు నమోదు కాగా, తూర్పుగోదావరి జిల్లాలో 853 కేసులు నమోదయ్యాయి.

తాజా కేసులతో రాష్ట్రంలోని మొత్తం కేసుల సంఖ్య 7,23,512కి చేరుకున్నాయి. ఇదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా 38 మంది మృతి చెందారు. దీంతో, మొత్తం మరణాల సంఖ్య 6,019కి చేరుకుంది. మరోవైపు ఇప్పటి వరకు 6,66,433 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 51,060 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
Go Back to Shorts
Andhra Pradesh
Corona Virus
Updates

More Telugu News