Kanyakumari: కన్యాకుమారి వద్ద దోబూచులాడుతున్న సముద్రం

  • కన్యాకుమారి వద్ద అస్థిరంగా సముద్రం
  • గురువారం ఉన్నట్టుండి లోపలికి వెళ్లిపోయిన నీళ్లు
  • శుక్రవారం ఉదయానికి యథాతథ స్థితి
  • రెండ్రోజులుగా ఇదే పరిస్థితి
Sea levels inconsistent at Kanyakumari shore

అమావాస్య, పౌర్ణమి రోజుల్లో సముద్రాలు మార్పులకు గురవుతుంటాయి. కొన్నిసార్లు అలల తీవ్రత పెరిగితే, మరికొన్నిసార్లు నిదానిస్తుంది. తాజాగా, తమిళనాడులోని కన్యాకుమారి వద్ద సముద్రం ఒక్కసారిగా లోపలికి వెళ్లిపోవడం స్థానికుల్లో ఆందోళన కలిగిస్తోంది. గురువారం సాయంత్రం సముద్రం నీరు లోపలికి లాగేసుకోవడంతో రాళ్లు, గుట్టలు బయటపడ్డాయి. మళ్లీ శుక్రవారం ఉదయానికి నీళ్లు యథాస్థితికి చేరాయి. కానీ శుక్రవారం రాత్రి సమయానికి సముద్రం వెనక్కివెళ్లిపోయింది.

కన్యాకుమారి భారతదేశ దక్షిణప్రాంతంలో చిట్టచివరన ఉంటుంది. ఇక్కడ బంగాళాఖాతం, హిందూ మహాసముద్రం, అరేబియా సముద్రం మూడు కలుస్తాయి. ఇక్కడి తీరంలో వివేకానంద మంటపం, ప్రముఖ తమిళ కవి తిరువళ్లువార్ విగ్రహం ఉన్నాయి. నీళ్లు వెనక్కి వెళ్లడంతో ఈ నిర్మాణాల వద్ద రాళ్లు కూడా బయటపడ్డాయి.

2004లో ఆగ్నేయ, దక్షిణాసియా దేశాలకు పీడకలలా మారిన సునామీ సమయంలోనూ సముద్రం ఇలాగే వెళ్లిందని గుర్తుచేసుకుని స్థానిక మత్స్యకారులు భయాందోళనలకు గురవుతున్నారు. గత రెండురోజులుగా సముద్రం దోబూచులాడుతుండడాన్ని వారు అంచనా వేయలేకపోతున్నారు.

More Telugu News