ఉదయం పీఏకి ఫోన్ చేస్తే సాయంత్రం మా పెద్దాయనే తిరిగి ఫోన్ చేశారు: సోమిరెడ్డి

Somireddy says he phoned Venkaiah Naidu to know his health condition
  • కరోనా బారినపడిన వెంకయ్యనాయుడు
  • ట్విట్టర్ లో స్పందించిన సోమిరెడ్డి
  • తెలుగువారి ఆకాంక్షను వెంకయ్యకు తెలిపానని వెల్లడి
భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కరోనా బారినపడిన సంగతి తెలిసిందే. ఆయన ప్రస్తుతం హోమ్ క్వారంటైన్ లో ఉన్నారు. వెంకయ్య అర్ధాంగి ఉషకు నెగెటివ్ రాగా ఆమె ముందు జాగ్రత్తగా సెల్ఫ్ ఐసోలేషన్ లోకి వెళ్లారు. ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లా టీడీపీ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ట్విట్టర్ లో స్పందించారు.

"మా పెద్దాయన వెంకయ్యనాయుడు గారి ఆరోగ్యంపై వాకబు చేయడానికి ఈ రోజు ఉదయం ఆయన పీఏకి ఫోన్ చేశాను. అయితే సాయంత్రం పెద్దాయనే తిరిగి కాల్ చేసి ఆరోగ్యంగా ఉన్నానని చెప్పారు" అని వివరించారు. మీరు సంపూర్ణ ఆరోగ్యం సంతరించుకుని దేశానికి రాష్ట్రపతి కావాలనేది నాతో పాటు తెలుగువారందరి ఆకాంక్ష అని ఆయనకు తెలియజేశానని సోమిరెడ్డి వెల్లడించారు.
Go Back to Shorts
Somireddy Chandra Mohan Reddy
Venkaiah Naidu
Corona Virus
Health
President Of India
Vice President Of India

More Telugu News