Corona Virus: ఏపీలో తగ్గుముఖం పడుతున్న కరోనా ప్రభంజనం

  • రాష్ట్రంలో నిదానించిన కరోనా
  • కొత్తగా 40 మరణాలు
  • 6,242 మందికి పాజిటివ్
  • అత్యల్పంగా శ్రీకాకుళంలో 192 కేసులు
Corona severeness downs gradually in Andhra Pradesh

కొన్నివారాల కిందట ఏపీలో కరోనా ప్రభావం పతాకస్థాయిలో కనిపించింది. నిత్యం 10 వేలకు పైగా కేసులు, 90కి తగ్గకుండా మరణాలు నమోదవుతూ ఆందోళనకర పరిస్థితి ఏర్పడింది. అయితే, కొన్నిరోజులుగా ఆ పరిస్థితిలో మార్పు వచ్చింది. ఇప్పుడు రోజుకు 50 లోపే మరణాల సంఖ్య నమోదవుతోంది. పాజిటివ్ కేసులు కూడా 6 వేలకు అటూఇటూగా వస్తున్నాయి.

తాజాగా విడుదలైన కరోనా బులెటిన్ లోనూ ఆ విషయం స్పష్టమైంది. గడచిన 24 గంటల్లో ఏపీలో 40 మరణాలు, 6,242 కొత్త పాజిటివ్ కేసులు వచ్చాయి. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 863 కేసులు గుర్తించారు. అత్యల్పంగా శ్రీకాకుళం జిల్లాలో 192 కేసులు వెల్లడయ్యాయి. తాజాగా 7,084 మందికి కరోనా నయమైంది.

ఓవరాల్ గణాంకాలు చూస్తే మొత్తం కరోనా కేసుల సంఖ్య 7,19,256కి పెరిగింది. ఇప్పటివరకు 6,58,875 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇంకా 54,400 మంది చికిత్స పొందుతున్నారు. అటు మొత్తం మరణాల సంఖ్య 5,981కి పెరిగింది.

More Telugu News