హోంమంత్రి మహమూద్ అలీ సమక్షంలో టీఆర్ఎస్ నేతల బాహాబాహీ
- రామ్ కోఠిలో ఎమ్మెల్సీ ఎన్నిక సన్నాహక సమావేశం
- వేదికపైకి పిలవలేదని ఆర్వీ మహేందర్ అలక
- సమావేశంలో తోపులాట
- కార్యకర్తలకు సర్దిచెప్పిన మహమూద్ అలీ
ఈ క్రమంలో హోంమంత్రి మహమూద్ అలీ కార్యకర్తలకు సర్దిచెప్పడంతో పరిస్థితి కొద్దిమేర సద్దుమణిగింది. ఆపై మహేందర్ ను వేదికపైకి రావాలని మైక్ లో అనౌన్స్ చేశారు. రామ్ కోఠిలోని రూబీ గార్డెన్స్ లో ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం సందర్భంగా ఈ రభస జరిగింది. తెలంగాణ ఉద్యమ కాలం నుంచి పార్టీ వెంటే ఉన్న తమకు గుర్తింపు లేదని ఆర్వీ మహేందర్ ఈ సందర్భంగా వాపోయారు.