Mumbai Indians: సన్ రైజర్స్ పై టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబయి ఇండియన్స్

Mumbai Indians won the toss and elected batting first against Sunrisers Hyderabad
  • ఐపీఎల్ లో నేడు సన్ రైజర్స్ వర్సెస్ ముంబయి ఇండియన్స్
  • సన్ రైజర్స్ బౌలింగ్ లో ఛేజింగ్ కష్టమని భావించిన రోహిత్
  • భువనేశ్వర్, ఖలీల్ అహ్మద్ కు విశ్రాంతి
  • సందీప్ శర్మ, కౌల్ లకు సన్ రైజర్స్ జట్టులో చోటు
ఐపీఎల్ లో భాగంగా షార్జా క్రికెట్ స్టేడియంలో నేడు సన్ రైజర్స్ హైదరాబాద్, ముంబయి ఇండియన్స్ జట్ల మధ్య మ్యాచ్ కు సర్వం సిద్ధమైంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ముంబయి జట్టు మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. ఛేజింగ్ లో సన్ రైజర్స్ బౌలింగ్ ను ఎదుర్కోవడం చాలా కష్టమని భావించిన ముంబయి కెప్టెన్ రోహిత్ శర్మ మరో ఆలోచన లేకుండా బ్యాటింగ్ చేసేందుకు మొగ్గు చూపాడు. పైగా ఇది చిన్న మైదానం అయినా సరే రోహిత్ శర్మ సన్ రైజర్స్ బౌలింగ్ లో ఛేదనకు ఇష్టపడలేదు.

కాగా, రెండు జట్లు టోర్నీలో ఇప్పటివరకు నాలుగేసి మ్యాచ్ లు ఆడాయి. రెండు విజయాలు, రెండు ఓటములు నమోదు చేశాయి. ఆయా జట్ల వివరాలు పరిశీలిస్తే... సన్ రైజర్స్ బౌలింగ్ విభాగంలో మార్పులు చేశారు. గత మ్యాచ్ లో గాయపడిన భువనేశ్వర్ కుమార్, ఖలీల్ అహ్మద్ లకు విశ్రాంతి ఇచ్చారు. వారిద్దరి స్థానంలో సందీప్ శర్మ, సిద్ధార్థ్ కౌల్ జట్టులోకి వచ్చారు. ముంబయి ఇండియన్స్ జట్టులో ఎలాంటి మార్పులు లేవు. అందరు ఆటగాళ్లు ఫిట్ గా ఉండడం ఆ జట్టుకు అదనపు బలం అని చెప్పాలి.
Mumbai Indians
Sunrisers Hyderabad
Toss
Batting
IPL 2020

More Telugu News