Rahul Gandhi: హత్రాస్ వెళ్లేందుకు రాహుల్, ప్రియాంకలకు పోలీసుల అనుమతి 

Permission given to Rahul and Priyanka to go to Hathras
  • ఐదుగురు నేతలకు అనుమతి
  • మరో ముగ్గురితో కలిసి బయల్దేరిన రాహుల్, ప్రియాంక
  • బాధిత కుటుంబాన్ని పరామర్శించనున్న కాంగ్రెస్ నేతలు
హత్రాస్ హత్యాచార ఘటన దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. నిందితులను కఠినంగా శిక్షించాలని జనాలు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు హత్రాస్ వెళ్లేందుకు కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకాగాంధీలకు పోలీసులు అనుమతి ఇచ్చారు. వీరిద్దరూ తమ పార్టీ ఎంపీలతో కలిసి ఈ మధ్యాహ్నం ఢిల్లీ నుంచి బయల్దేరారు. అయితే మార్గమధ్యంలో యూపీ సరిహద్దుల వద్ద వీరిని పోలీసులు అడ్డుకున్నారు. హత్రాస్ లో 144 సెక్షన్ అమల్లో ఉన్నందున నేతలు వెళ్లేందుకు అనుమతి లేదని తెలిపారు.

అయితే ఆ తర్వాత ఉన్నతాధికారులతో సంప్రదింపుల అనంతరం కాంగ్రెస్ నేతల పర్యటనకు అనుమతి లభించింది. అయితే కేవలం ఐదుగురు మాత్రమే వెళ్లాలని కండిషన్ పెట్టడంతో... రాహుల్, ప్రియాంకలతో పాటు మరో ముగ్గురు నేతలు అక్కడి నుంచి హత్రాస్ కు బయల్దేరారు. కాసేపట్లో బాధిత కుటుంబాన్ని వారు పరామర్శించనున్నారు.
Rahul Gandhi
Priyanka Gandhi
Hathras
Congress

More Telugu News