చంద్రబాబు సవాల్ విసిరితే సీఎం జగన్ పారిపోయారు: అయ్యన్నపాత్రుడు
- వైసీపీ నేతలపై అయ్యన్న ఫైర్
- విశాఖ పార్లమెంటు స్థానంలో ఎన్నికలకు వెళదాం అంటూ సవాల్
- ధర్మాన సిద్ధమా అంటూ ప్రశ్నించిన అయ్యన్న
అమరావతి రాజధానా, లేక విశాఖ రాజధానా అనే అంశంపై అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు పోదాం అని చంద్రబాబు కోరితే సీఎం జగన్ పారిపోయారని ఎద్దేవా చేశారు. విశాఖ ప్రజలు రాజధాని కోరుకోవడంలేదని అయ్యన్నపాత్రుడు స్పష్టం చేశారు. రౌడీయిజం, భూకబ్జాలు, దందాలు, దౌర్జన్యాలతో విశాఖను భ్రష్టుపట్టించారని మండిపడ్డారు.