Vijayasai Reddy: శారదాపీఠాధిపతి స్వరూపానంద ఆశీస్సులు అందుకున్న విజయసాయి దంపతులు

Vijayasai Reddy and his wife gets blessings from Swami Swaroopananda
  • రిషికేష్ లో చాతుర్మాస్య దీక్ష పూర్తి చేసుకున్న శారదాపీఠాధిపతి
  • దీక్ష ముగిసిన పిమ్మట విశాఖ చేరిక
  • సతీసమేతంగా శారదాపీఠానికి వెళ్లిన విజయసాయి
విశాఖ శారదా పీఠాధిపతి స్వామి స్వరూపానంద చాతుర్మాస్య దీక్ష ముగించుకుని విశాఖ వచ్చారు. ఆయన రిషికేష్ లో చాతుర్మాస్య దీక్ష ఆచరించారు. దీక్ష ముగించుకుని విశాఖ వచ్చిన ఆయనను వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి సతీసమేతంగా కలిశారు. శారదాపీఠం ఆశ్రమానికి వెళ్లిన విజయసాయి దంపతులు స్వరూపానంద ఆశీస్సులు అందుకున్నారు.

ఈ సందర్భంగా స్వరూపానంద వారికి పట్టువస్త్రాలు బహూకరించి దీవెనలు అందజేశారు. దీనికి సంబంధించిన ఫొటోలను విజయసాయి తన ట్విట్టర్ లో అకౌంట్ లో పంచుకున్నారు. కాగా, స్వామి స్వరూపానంద రిషికేష్ లో దీక్ష చేపట్టిన సమయంలోనూ అనేకమంది ప్రముఖులు అక్కడికే వెళ్లి ఆయనను కలిసి ఆశీస్సులు అందుకున్నారు.
Vijayasai Reddy
Swami Swaroopananda
Sharada Pitham
Visakhapatnam

More Telugu News