Cinema Theatres: థియేటర్ల ప్రారంభానికి గ్రీన్ సిగ్నల్...హైదరాబాదులో ఓనర్స్ అసోసియేషన్ సమావేశం

Telangana Theatres Owners Association meets in Hyderabad
  • 15 నుంచి థియేటర్లు తెరుచుకోవచ్చన్న కేంద్రం
  • థియేటర్లు తెరవాలని నిర్ణయించిన ఓనర్స్ అసోసియేషన్
  • తెలంగాణ ప్రభుత్వం సహకరించాలని విన్నపం 
అన్ లాక్-5లో భాగంగా ఈ నెల 15 నుంచి సినిమా థియేటర్లను ప్రారంభించుకోవడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతించిన సంగతి తెలిసిందే అయితే 50 శాతం మంది ప్రేక్షకులతో మాత్రమే సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ థియేటర్లు నడపాలని షరతు విధించింది.  ఈ నేపథ్యంలో హైదరాబాదులోని సుదర్శన్ థియేటర్ లో తెలంగాణ థియేటర్ ఓనర్స్ అసోసియేషన్ సమావేశమైంది.

ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు విజయేంద్రరెడ్డి మాట్లాడుతూ, థియేటర్లను తెరవడానికి కేంద్రం అనుమతించిందని, తెలంగాణ ప్రభుత్వం కూడా అనుమతిస్తుందని భావిస్తున్నామని చెప్పారు. థియేటర్లు తెరవాలని ఓనర్స్ అసోసియేషన్ నిర్ణయించిందని తెలిపారు. పార్కింగ్ రుసుము వసూలు చేసుకునేందుకు ప్రభుత్వం అనుమతించాలని కోరారు. తమకు ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరించాలని విన్నవించారు.
Cinema Theatres
Telangana

More Telugu News