Panchumarthi Anuradha: అనకాపల్లిలో ఓ రౌడీ గ్యాంగ్ ప్రతివారం వనభోజనాలు పెడుతోంది: పంచుమర్తి అనురాధ

  • ఉత్తరాంధ్ర వైసీపీ నేతలపై పంచుమర్తి ధ్వజం
  • ఉత్తరాంధ్ర ద్రోహులు అంటూ వ్యాఖ్యలు
  • చర్చకు రావాలంటూ బొత్స, స్పీకర్ తమ్మినేనిలకు సవాల్
Panchumarthi Anuradha fires on YCP leaders

ఉత్తరాంధ్ర వైసీపీ నేతలపై టీడీపీ మహిళా నేత పంచుమర్తి అనురాధ ధ్వజమెత్తారు. వైసీపీ నేతలు విశాఖను వీసా పట్టణంగా మార్చేశారని, దందాలతో ప్రజల్లో భయానక వాతావరణం సృష్టిస్తున్నారని ఆరోపించారు. వైఎస్ హయాంలోనే ఉత్తరాంధ్ర విధ్వంసానికి నాంది పలికారని, సీఎం జగన్ విశాఖను రౌడీషీటర్లకు నిలయంగా మార్చారని విమర్శించారు. ఉత్తరాంధ్రను కుక్కలు చింపిన విస్తరి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అనకాపల్లిలో ఓ రౌడీ ముఠా ప్రతివారం వనభోజనాలు పెడుతోందని, అవి పైకి వనభోజనాలే అయినా, లోపల భూదందాలు జరుగుతుంటాయని వెల్లడించారు. వైసీపీ నేతలు ఉత్తరాంధ్ర ద్రోహులని, వైసీపీ పాలనలో పులివెందుల దొంగలు ఉత్తరాంధ్రను దోపిడీ చేశారని మండిపడ్డారు. వైసీపీ అవినీతికి ఏదీ అనర్హం కాదని, గంజాయి అమ్ముతున్నారని, నకిలీ నోట్లు చెలామణి చేస్తున్నారని తెలిపారు.

చిత్తశుద్ధి ఉంటే వంశధార-నాగావళి ఇసుక మాఫియాపై స్పీకర్ తమ్మినేని సీతారాం, మాన్సాస్ అక్రమాలు, సింహాచలం భూములపై మంత్రి బొత్స చర్చకు రావాలని పంచుమర్తి అనురాధ సవాల్ విసిరారు.

More Telugu News