Sabbam Hari: నేనేంటో విజయసాయికి తెలియదు.. 24 గంటల్లో మ్యాటర్ క్లోజ్ చేస్తా: సబ్బం హరి

I will show Vijayasai Reddy what I am says Sabbam Hari
  • తన ఇంటి ప్రహరీని కూల్చడంపై హరి ఫైర్
  • విశాఖలో విజయసాయి డ్యాన్స్ చేయాలనుకుంటున్నారు
  • ఆయన డ్యాన్స్ కట్టిస్తా
మాజీ ఎంపీ సబ్బం హరి ఇంటి ప్రహరీని విశాఖ జీవీఎంసీ అధికారులు కూల్చేసిన సంగతి తెలిసిందే. హరి నివాసాన్ని అక్రమ కట్టడంగా అధికారులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అక్కడకు వచ్చిన అధికారులపై సబ్బం హరి మండిపడ్డారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఎలా కూల్చివేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై నిప్పులు చెరిగారు.

తానేంటో ముఖ్యమంత్రి జగన్ కు తెలుసనీ, విజయసాయికి తన గురించి తెలియదనుకుంటానని హరి అన్నారు. విశాఖలో కూర్చొని ఏదో చేద్దామనుకుంటే సాధ్యమయ్యే విషయం కాదని చెప్పారు. విశాఖలో డ్యాన్స్ చేద్దామని అనుకుంటున్నారని... ఆయన డ్యాన్స్ ని కట్టిస్తానని అన్నారు. తన గురించి తెలియక ఏదో చేద్దామనుకుంటున్నారని... ఈ తప్పు ఎందుకు చేశానా? అని బాధ పడే స్థాయికి తీసుకెళ్తానని చెప్పారు. ఇది లీగల్ గా వెళ్లేంత పెద్ద విషయం కాదని... 24 గంటల్లో సమస్యను క్లోజ్ చేస్తానని చెప్పారు.
Sabbam Hari
Vijayasai Reddy
YSRCP
Vizag

More Telugu News