Chandrababu: సబ్బం హరి ఇంటిని కూల్చేసిన వీడియో పోస్ట్ చేసి మండిపడ్డ చంద్రబాబు

chandra babu slams ycp
  • ఇంటిని కూల్చేయడాన్ని తీవ్రంగా నిరసిస్తున్నా
  • రాత్రి వేళ కూల్చాల్సిన అవసరం ఏమొచ్చింది
  • ఏమిటీ సైకోయిజం?
  • కక్షపూరిత రాజకీయాలు చేసేది అసమర్థులే
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తీరుపై టీడీపీ నేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. టీడీపీ మాజీ ఎంపీ సబ్బం హరికి చెందిన సీతమ్మధారలోని ఆయన ఇంటి ప్రహరీని కూల్చివేసిన వీడియోను చంద్రబాబు తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.

'తెలుగుదేశం నేత సబ్బం హరిగారి ఇంటిని కూల్చేయడాన్ని తీవ్రంగా నిరసిస్తున్నా. రాత్రి వేళ కూల్చాల్సిన అవసరం ఏమొచ్చింది. ఏమిటీ సైకోయిజం?' అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.  

'ఒక మాజీ ఎంపీకే ఇలాంటి పరిస్థితి వస్తే సామాన్యులు ఎంత ప్రమాదకర పాలనలో ఉన్నారో అర్థం చేసుకోవాలి. ఈ కక్షపూరిత రాజకీయాలు చేసేది అసమర్థులు తప్ప సమర్థులు కాదు' అని చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు.  

Chandrababu
Telugudesam
Sabbam Hari
Viral Videos

More Telugu News