Former Judge: హైదరాబాదులో విషాదం.. కరోనా సోకిందని రిటైర్డ్‌ జడ్జి ఆత్మహత్య

Retired judge in Hyderabad commits suicide in Hyderabad
  • మియాపూర్ లోని ఇంటిలో ఉరి వేసుకుని ఆత్మహత్య
  • కుటుంబ సభ్యులకు కరోనా సోకకూడదని సూసైడ్
  • సూసైడ్ నోట్ రాసిన మాజీ జడ్జి
హైదరాబాదులో బాధాకరమైన ఘటన చోటు చేసుకుంది. కరోనా లక్షణాలు ఉన్నాయనే భయంతో రిటైర్డ్ జడ్జి రామచంద్రారెడ్డి ఆత్మహత్య చేసుకున్నారు. మియాపూర్ లోని న్యూ సైబర్ హిల్స్ లో ఉన్న తన నివాసంలో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు.

ఆత్మహత్యకు ముందు సూసైడ్ నోట్ కూడా రాశారు. తన వల్ల కుటుంబ సభ్యులకు కరోనా సోకకూడదనే ఆత్మహత్య చేసుకుంటున్నట్టు సూసైడ్ నోట్ లో పేర్కొన్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. కరోనా సోకిందనే కారణంతో ఇప్పటికే ఎంతో మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. అయితే, జడ్జిగా ఎన్నో ఏళ్ల పాటు సేవలందించిన ఒక రిటైర్డ్ జడ్జి ఆత్మహత్య చేసుకోవడం ఇదే ప్రథమం. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలిని పరిశీలించారు. సూసైడ్ నోట్ ను స్వాధీనం చేసుకున్నారు.
Former Judge
Ex Judge
Suicide
Hyderabad

More Telugu News