Gajendra Singh Shekhawat: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి

Union minister Gajendra Shekhawat offers prayers at Tirumala
  • ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో వచ్చిన గజేంద్ర షెకావత్
  • విమానాశ్రయం వద్ద స్వాగతం పలికిన రాష్ట్ర మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు
  • రోడ్డు మార్గంలో తిరుమల చేరుకున్న కేంద్ర మంత్రి
కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఢిల్లీ నుంచి రేణిగుంట విమానాశ్రయానికి ఆయన ప్రత్యేక విమానంలో వచ్చారు. విమానాశ్రయం వద్ద ఆయనకు మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, ఎంపీ మిథున్ రెడ్డితో పాటు పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు స్వాగతం పలికారు. అనంతరం ఆయన అక్కడి నుంచి రోడ్డుమార్గంలో తిరుమలకు చేరుకున్నారు. తిరుమలలో ఆయనకు ఆలయ అధికారులు, అర్చకులు స్వాగతం పలికారు. దర్శనానంతరం ఆయన ఢిల్లీకి తిరుగుపయనమవుతారు.
Gajendra Singh Shekhawat
Tirumala
BJP

More Telugu News