Harish Rao: సోలిపేట ఒకే జీవితంలో మూడు అవతారాలు సక్సెస్ ఫుల్ గా చూశారు: హరీశ్ రావు

Harish Rao praises late Solipeta Ramalingareddy
  • సిద్ధిపేటలో సోలిపేటపై పుస్తకావిష్కరణ
  • కార్యక్రమంలో పాల్గొన్న హరీశ్ రావు
  • స్వప్న సాధకుడు పుస్తకాన్ని ఆవిష్కరించిన హరీశ్ రావు
దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ఇటీవల అనారోగ్యంతో మరణించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సిద్ధిపేటలో రెడ్డి సంక్షేమ భవన్ లో మంజీర రచయితల సంఘం సోలిపేట రామలింగారెడ్డిపై స్వప్న సాధకుడు అనే పుస్తకాన్ని తీసుకురాగా, మంత్రి హరీశ్ రావు ఆ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దివంగత సోలిపేట రామలింగారెడ్డి ఒకే జీవితంలో మూడు అవతారాలు విజయవంతంగా చూశారని తెలిపారు. వామపక్ష భావజాల ఉద్యమాల్లో, తెలంగాణ ఉద్యమంలో, ప్రజాప్రతినిధిగా ఆయన సాఫల్యం పొందారని వివరించారు. ఆయన స్టేజీ వివాహం చేసుకోవడమే కాకుండా, తన పిల్లలకు సైతం స్టేజీ వివాహాలు జరిపించి ఆదర్శంగా నిలిచారని హరీశ్ రావు కొనియాడారు. అధికారంలో ఉన్నప్పటికీ సమస్యలు వస్తే మాత్రం ప్రతిపక్ష పాత్ర పోషించి సమస్య పరిష్కారం అయ్యేవరకు విశ్రమించేవారు కాదని ప్రశంసించారు. 
Harish Rao
Solipeta Ramalingareddy
Memorial
Book
Sidhipet
TRS

More Telugu News