Viral Pics: ముళ్ల కంచె డ్రస్ తో మోదీ ప్రభుత్వంపై యువతి నిరసన అంటూ ప్రచారం... ఫేక్ ఫొటో అని తేలిన వైనం!

Fake Photo on Hatras Protest
షార్ట్స్‌లో చూడండి
దేశంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని పలు ప్రాంతాల్లో నిరసనలు మిన్నంటుతున్న వేళ, సామాజిక మాధ్యమాల్లో ఓ చిత్రం వైరల్ అయింది. ఒళ్లంతా ముళ్ల తీగలు చుట్టుకున్న మహిళ తీవ్ర నిరసన తెలియజేస్తుండగా, మోదీ ప్రభుత్వానికి ఇది చెంపదెబ్బని వ్యాఖ్యానిస్తూ, పలువురు ఈ ఫొటోను వైరల్ చేస్తున్నారు. దీంతో కొన్ని ఫ్యాక్ట్ చెక్ ఏజన్సీలు అసలు విషయాన్ని తెలిపాయి.

ఈ ఫొటోను హత్రాస్ నిరసనలకు సంబంధించినది కాదు. అసలు నిరసనే కాదు. శ్రీలంకలో ఓ రకం సంప్రదాయ వస్త్రాలంకరణ. దీని పేరు 'ఓసారియా'. 2015లో కొలంబియాకు చెందిన జనని కురేయ్ అనే మహిళ పర్యాటకురాలిగా శ్రీలంకకు వెళ్లి, అక్కడ ఇలాంటి వస్త్రధారణ ధరించింది. ఈ తరహా చిత్రాలు ఇంటర్నెట్ లో చాలానే ఉన్నాయి. అదీ సంగతి!
Go Back to Shorts
Viral Pics
Narendra Modi

More Telugu News