Hathras: హత్రాస్ నిందితులను బహిరంగంగా కాల్చి చంపాలి: బీజేపీ ఎంపీ లాకెట్ ఛటర్జీ

BJP MP Locket Chatterjee demands shoot Hathras culprits
  • దోషులను ప్రజల ముందుకు ఈడ్చుకొచ్చి శిక్ష విధించాలి
  • ఇలాంటి నేరాలను ఉపేక్షించ కూడదు
  • నేరగాళ్లపై కనికరం తగదు
హత్రాస్ సామూహిక అత్యాచార ఘటనపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు పెల్లుబుకుతున్న వేళ పశ్చిమ బెంగాల్‌కు చెందిన బీజేపీ ఎంపీ లాకెట్ ఛటర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టానికి మద్దతుగా నిర్వహించిన ర్యాలీ అనంతరం మాట్లాడిన ఎంపీ.. యువతిపై అత్యాచారానికి తెగబడిన మానవ మృగాలను బహిరంగంగా కాల్చి చంపాలని డిమాండ్ చేశారు. బాధితురాలిపై దుర్మార్గానికి ఒడిగట్టిన కిరాతకులను ఏమాత్రం ఉపేక్షించరాదని అన్నారు. ప్రజల ముందుకు దోషులను ఈడ్చుకొచ్చి ఎన్‌కౌంటర్ చేసి చంపాలని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి నేరగాళ్లపై కనికరం తగదని అన్నారు.
Hathras
Uttar Pradesh
Gang Rape
Locket Chatterjee
BJP

More Telugu News