టీడీపీకి మరో షాక్.. ఎల్లుండి వైసీపీలో చేరనున్న గంటా?

01-10-2020 Thu 17:02
Ganta Srinivasa Rao joining YSRCP on Oct 3
  • వైసీపీ గూటికి చేరేందుకు సర్వం సిద్ధం
  • 3న జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం
  • టెక్నికల్ సమస్యలు ఎదురుకాకుండా కుమారుడిని చేర్పించనున్న గంటా

తెలుగుదేశం పార్టీకి మరో పెద్ద షాక్ తగలబోతోంది. పార్టీ సీనియర్ నేత గంటా శ్రీనివాసరావు వైసీపీ తీర్థం పుచ్చుకోబోతున్నారు. ఈనెల 3న వైసీపీలో చేరేందుకు ముహూర్తం ఖరారైనట్టు తెలుస్తోంది. ఇదే విషయానికి సంబంధించి విశాఖ నార్త్ వైసీపీ ఇంచార్జ్ కేకే రాజుకు పార్టీ అధినాయకత్వం నుంచి సమాచారం వచ్చినట్టు చెపుతున్నారు. ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో వైసీపీ గూటికి గంటా చేరనున్నారు. అయితే, టెక్నికల్ సమస్యలు ఎదురుకాకుండా చూసుకోవడానికి... తన కుమారుడు రవితేజకు మాత్రమే వైసీపీ కండువా కప్పనున్నారు.