టీడీపీ పొలిట్ బ్యూరోకు గల్లా అరుణకుమారి రాజీనామా

01-10-2020 Thu 16:25
Galla Aruna Kumar quits TDP political bureau
  • వ్యక్తిగత కారణాలతో తప్పుకుంటున్నట్టు వెల్లడి
  • పార్టీ అధినాయకత్వానికి రాజీనామా లేఖ
  • 2014లో కాంగ్రెస్ ను వీడి టీడీపీలో చేరిన గల్లా అరుణకుమారి

గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ తల్లి, సీనియర్ నేత గల్లా అరుణకుమారి టీడీపీ పొలిట్ బ్యూరో నుంచి వైదొలిగారు. ఈ మేరకు పార్టీ అధినాయకత్వానికి రాజీనామా లేఖ పంపారు. వ్యక్తిగత కారణాలతోనే పొలిట్ బ్యూరో నుంచి తప్పుకుంటున్నట్టు వెల్లడించారు. గతకొన్నిరోజులుగా టీడీపీ అధినాయకత్వం కొత్త కమిటీల నియామకం జరుపుతోంది. ఇటీవలే పార్లమెంటరీ నియోజకవర్గాల ఇన్చార్జిలను కూడా నియమించింది. ఈ తరుణంలో అరుణకుమారి కీలక బాధ్యతల నుంచి వైదొలగడం చర్చనీయాంశంగా మారింది.

గల్లా అరుణకుమారి 2014లో కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరారు. రాష్ట్రవిభజన అనంతరం జరిగిన ఎన్నికల్లో చంద్రగిరి నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున పోటీచేసి ఓటమి పాలయ్యారు. గత ఎన్నికల ముందు నుంచి ఆమె పార్టీ కార్యకలాపాలకు కాస్త ఎడంగానే ఉంటున్నారు.