Sensex: అన్ లాక్-5 ఎఫెక్ట్.. దూసుకుపోయిన మార్కెట్లు!

  • 629 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
  • 169 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ
  • 12 శాతానికి పైగా పుంజుకున్న ఇండస్ ఇండ్ బ్యాంక్
Markets ends in profits due to lockdown 5

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ రోజు భారీ లాభాల్లో ముగిశాయి. అన్ లాక్-5 లో భాగంలో స్కూళ్లు, థియేటర్లకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం మార్కెట్లపై ప్రభావం చూపింది. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 629 పాయింట్లు పెరిగి 38,697కి చేరుకుంది. నిఫ్టీ 169 పాయింట్లు పుంజుకుని 11,416కి ఎగబాకింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఇండస్ ఇండ్ బ్యాంక్ (12.41%), బజాజ్ ఫైనాన్స్ (5.11%), యాక్సిస్ బ్యాంక్ (4.44%), బజాజ్ ఆటో (4.19%), టెక్ మహీంద్రా (3.75%).

టాప్ లూజర్స్:
ఐటీసీ (-0.52%), ఎన్టీపీసీ (-0.47%), రిలయన్స్ ఇండస్ట్రీస్ (-0.39%), టైటాన్ కంపెనీ (-0.26%), ఓఎన్జీసీ (-0.22%).

More Telugu News