వచ్చేసిన గూగుల్ 5జీ ఫోన్లు... వివరాలు!

01-10-2020 Thu 10:30
Google Pixel New Smart Phones Released
  • రెండు వేరియంట్లు విడుదల
  • పిక్సెల్ 5, పిక్సెల్ 4ఏ 5జీ మార్కెట్లోకి
  • పలు రకాల ఆకర్షణలతో కొత్త ఫోన్లు

స్మార్ట్ ఫోన్ ప్రియులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న గూగుల్ కొత్త ఫోన్లు వచ్చేశాయి. పిక్సల్ 4ఏలో 5జీ వర్షన్ ను, పిక్సెల్ 5 పేరిట రెండు వేరియంట్లను సంస్థ విడుదల చేసింది. వీటిల్లో స్నాప్ డ్రాగన్ 765జీ ప్రాసెసర్ ఉంటుందని, దీనికి రక్షణగా టైటాన్ ఎం సెక్యూరిటీ చిప్ ఉంటుందని సంస్థ తెలిపింది. ఇక ఫోన్ల స్పెసిఫికేషన్స్ పరిశీలిస్తే...

గూగుల్ పిక్సెల్ 5: డ్యూయల్ సిమ్ (నాన్ ప్లస్ ఈ-సిమ్), ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్, ఫుల్ హెచ్డీ 6 అంగుళాల ఓఎల్ఈడీ డిస్ ప్లే, కార్నింగ్ గొరిల్లా గ్లాస్, 8 జీబీ రామ్ ఉంటాయి. డ్యూయల్ రేర్ కెమెరాలు (12.2 ఎంపీ / 8 ఎంపీ), ఫ్రంట్ కెమెరా 8 ఎంపీ ఉంటాయి. వీటితో 4కే వీడియోలను కూడా తీసుకోవచ్చని సంస్థ తెలిపింది. 128 జీబీ ఆన్ బోర్డ్ స్టోరేజ్, 5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై, బ్లూటూత్ 5.0, జీపీఎస్ / ఏజీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ సదుపాయాలుంటాయి. యాక్సిలెరోమీటర్, బారోమీటర్, గైరోస్కోప్, ప్రాక్సిమిటీ సెన్సార్, ఫింగర్ ప్రింట్ సెన్సార్, స్టీరియో స్పీకర్స్, మూడు మైక్రోఫోన్ లుంటాయి. 4,080 ఎంఏహెచ్ బ్యాటరీతో లభించే దీని బరువు కేవలం 151 గ్రాములు మాత్రమే.

గూగుల్ పిక్సెల్ 5 ధర 699 డాలర్లు (సుమారు రూ. 51,400)

గూగుల్ పిక్సెల్ 4ఏ 5జీ:   డ్యూయల్ సిమ్ (నాన్ ప్లస్ ఈ-సిమ్), ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్, ఫుల్ హెచ్డీ 6.2 అంగుళాల ఓఎల్ఈడీ డిస్ ప్లే, కార్నింగ్ గొరిల్లా గ్లాస్, 6 జీబీ రామ్ ఉంటాయి. డ్యూయల్ రేర్ కెమెరాలు (16 ఎంపీ / 12.2 ఎంపీ), ఫంట్ కెమెరా 8 ఎంపీ ఉంటాయి. వీటితో 4కే వీడియోలను కూడా తీసుకోవచ్చని సంస్థ తెలిపింది. 128 జీబీ ఆన్ బోర్డ్ స్టోరేజ్, 5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై, బ్లూటూత్ 5.0, జీపీఎస్ / ఏజీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్ సదుపాయాలుంటాయి. యాక్సిలెరోమీటర్, బారోమీటర్, గైరోస్కోప్, ప్రాక్సిమిటీ సెన్సార్, మాగ్నిటో మీటర్, స్టీరియో స్పీకర్స్, రెండు మైక్రోఫోన్ లుంటాయి. 3,885 ఎంఏహెచ్ బ్యాటరీతో లభించే దీని బరువు కేవలం 168 గ్రాములు.

గూగుల్ పిక్సెస్ 4ఏ 5జీ ధర 499 డాలర్లు (సుమారు రూ. 37 వేలు)