Hathras: హత్రాస్ బాధిత కుటుంబానికి రూ. 25 లక్షల సాయం, ప్రభుత్వ ఉద్యోగం: యూపీ ప్రభుత్వం ప్రకటన

  • నలుగురు మృగాళ్ల చేతిలో అత్యాచారానికి గురై అసువులు బాసిన బాధితురాలు
  • దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహావేశాలు
  • నిందితులను కఠినంగా శిక్షిస్తామన్న యూపీ సీఎం
UP CM Yogi Adityanath announce Rs 25 lakh to Hathras victims family

హత్రాస్ బాధిత కుటుంబానికి రూ. 25 లక్షల ఆర్థిక సాయాన్ని ఇవ్వనున్నట్టు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. అలాగే, వారి కుటుంబంలో ఒకరికి ఉపాధ్యాయ ఉద్యోగంతోపాటు ఇల్లు కూడా మంజూరు చేయనున్నట్టు తెలిపింది. బాధితురాలి తండ్రితో నిన్న వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నిందితులను కఠినంగా శిక్షిస్తామన్నారు. ప్రభుత్వం తరపున అన్ని విధాలుగా కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు.

కాగా, హత్రాస్ జిల్లాలో ఓ దళిత యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన నలుగురు వ్యక్తులు అనంతరం ఆమెను దారుణంగా హింసించారు. ఘటన గురించి ఎవరికీ చెప్పకుండా ఉండేందుకు ఆమె నాలుకను తెగ్గోశారు. తీవ్ర గాయాలపాలైన బాధితురాలు ఢిల్లీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మొన్న కన్నుమూసింది. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి.

More Telugu News