Bihar: బీహార్‌లో తెరపైకి నయా ఫ్రంట్.. 243 స్థానాలకూ పోటీ చేస్తామన్న కుష్వాహా

  • ఎన్డీయే, ఆర్జేడీ కూటములకు సమాంతరంగా మరో కూటమి
  • నితీశ్, లాలు, రబ్రీదేవి పాలనలో రాష్ట్రంలో దారుణ పరిస్థితులు
  • కూటమిలో బహుజన్ సమాజ్ పార్టీ
RLSP chief Upendra Kushwaha forms new front

కేంద్ర మాజీ మంత్రి, ఆర్ఎల్‌ఎస్‌పీ చీఫ్ ఉపేంద్ర కుష్వాహా సంచలన ప్రకటన చేశారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే, ఆర్జేడీ కూటములకు సమాంతరంగా మరో కూటమిని ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. రాష్ట్రంలోని మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకూ పోటీ చేస్తామని చెప్పారు. తమ ఫ్రంట్‌లో బహుజన్ సమాజ్‌పార్టీ భాగస్వామిగా ఉంటుందన్నారు.

ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, లూలుప్రసాద్, రబ్రీదేవిలపై కుష్వాహా నిప్పులు చెరిగారు. వారంతా ఒకే నాణానికి ఇరువైపుల ఉన్న బొమ్మబొరుసు లాంటి వారని అన్నారు. మూడున్నర దశాబ్దాల వారి పాలనలో రాష్ట్రం దారుణంగా తయారైందని కుష్వాహా ధ్వజమెత్తారు.

బీహార్‌లో ఎన్నికల పోలింగ్ మూడు దశల్లో నిర్వహించనున్నారు. అక్టోబరు 28న తొలి విడత, నవంబరు 3న రెండో విడత, 7న తుది దశ ఎన్నికల పోలింగ్ జరగనుంది. అదే నెల 10న ఫలితాలు వెల్లడికానున్నాయి.

More Telugu News