రాణించిన విదేశీ ఆటగాళ్లు.... సన్ రైజర్స్ గౌరవప్రదమైన స్కోరు

29-09-2020 Tue 21:34
  • 20 ఓవర్లలో 4 వికెట్లకు 162 రన్స్ చేసిన హైదరాబాద్
  • బెయిర్ స్టో అర్ధసెంచరీ
  • రబాడా, మిశ్రాకు చెరో రెండు వికెట్లు
With the help of foreign players Sunrisers Hyderabad posts a respectable score

ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుపై మొదట బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 162 పరుగులు చేసింది. విదేశీ ఆటగాళ్లు కెప్టెన్ డేవిడ్ వార్నర్ (45), జానీ బెయిర్ స్టో (53), కేన్ విలియమ్సన్ (41) రాణించడంతో సన్ రైజర్స్ గౌరవప్రదమైన స్కోరు నమోదు చేసింది. కొత్తగా వచ్చిన అబ్దుల్ సమద్ ఓ సిక్స్, ఓ ఫోర్ బాది 12 పరుగులు చేశాడు. మనీష్ పాండే 3 పరుగులు మాత్రమే కొట్టి నిరాశపరిచాడు. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో కగిసో రబాడా 2, అమిత్ మిశ్రా 2 వికెట్లు తీశారు.

తొలి రెండు మ్యాచ్ లలో ఓటమిపాలైన నేపథ్యంలో ఈ మ్యాచ్ లో హైదరాబాద్ బ్యాట్స్ మెన్ ఆచితూచి ఆడడంతో స్కోరుబోర్డు ఆశించిన వేగంతో సాగలేదు. కీలక సమయాల్లో వికెట్లు కోల్పోవడంతో భారీ స్కోరు సాధ్యం కాలేదు. ఈ మ్యాచ్ లో ఢిల్లీ టాస్ గెలిచి హైదరాబాద్ కు బ్యాటింగ్ అప్పగించడం తెలిసిందే.