డ్రగ్స్ కేసు.. తెలుగు హీరోలకు నోటీసులు పంపనున్న ఎన్సీబీ?

29-09-2020 Tue 18:33
NCB to send notices to Tollywood heros
  • బాలీవుడ్ ని వణికిస్తున్న డ్రగ్స్ విచారణ
  • ఇప్పటికే పలువురు హీరోయిన్ల విచారణ
  • విచారణలో తెలుగు నటుల పేర్లు వెల్లడైనట్టు సమాచారం

డ్రగ్స్ విచారణ దెబ్బకు బాలీవుడ్ షేక్ అవుతోంది. దీపికా పదుకునే వంటి అగ్రనటితో పాటు రకుల్ ప్రీత్, సారా అలీ ఖాన్, శ్రద్ధా కపూర్ ఇప్పటికే ఎన్సీబీ విచారణకు హాజరయ్యారు. తాజాగా మరో నలుగురు నటుల పేర్లు బయటకు వచ్చినట్టు తెలుస్తోంది. వీరిలో తెలుగు హీరోలు కూడా ఒకరిద్దరు ఉన్నట్టు సమాచారం. వీరందరికీ త్వరలోనే ఎన్సీబీ నోటీసులు జారీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

విచారణలో పేర్లు బయటకు వచ్చిన అందరి ఫోన్లపై ఎన్సీబీ అధికారులు నిఘా పెట్టారు. టాలీవుడ్ నటులకు కూడా సమన్లు జారీ అయ్యే అవకాశం ఉందనే వార్తతో తెలుగు ఇండస్ట్రీ ఆందోళనకు గురవుతోంది. రెండేళ్ల క్రితం డ్రగ్స్ విచారణ టాలీవుడ్ ని వణికించిన సంగతి తెలిసిందే. అయితే, ఆ విచారణ ఇప్పటికీ ఒక కొలిక్కి రాలేదు.