Tirumala: క్రమంగా పెరుగుతున్న తిరుమల భక్తులు... ఒక్కరోజులో 4 వేల మంది అదనం!

  • కరోనా పోవాలని ప్రత్యేక దీక్ష
  • 16 రోజులు కొనసాగనున్న దీక్ష
  • క్రమంగా పెరుగుతున్న భక్తులు
Piligrims Rush in Tirumala

తిరుమలలో నేటి నుంచి సుందరకాండ దీక్ష ప్రారంభం కానుంది. ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా పోవాలని కోరుతూ, వసంత మండపంలో ఈ దీక్షను రుత్విక్కులు, దీక్షాధారులు మొదలుపెట్టనున్నారు. మొత్తం 16 రోజుల పాటు ఈ దీక్ష కొనసాగనుంది. ఇందులో భాగంగా 2,821 శ్లోకాలను దీక్షాధారులు పఠించనున్నారు. ఇందుకోసం టీటీడీ అన్ని ఏర్పాట్లూ చేసింది.

కాగా, తిరుమలలో భక్తుల రద్దీ క్రమంగా పెరుగుతోంది. ఆదివారం నాడు దాదాపు 12 వేల మందికి పైగా భక్తులు స్వామివారిని దర్శించుకోగా, సోమవారం నాడు ఈ సంఖ్య 16 వేలను దాటింది. నిన్న 16,773 మంది స్వామిని దర్శించుకున్నారు. 5,052 మంది భక్తులు తలనీలాలను సమర్పించారని, హుండీ ద్వారా రూ. 1.41 కోట్ల ఆదాయం లభించిందని అధికారులు వెల్లడించారు.

More Telugu News