యాజమాన్య హక్కులు మారినంత మాత్రాన పబ్జీ గేమ్ స్వభావం మారదు: కేంద్రం
- ఇటీవల పబ్జీపై కేంద్రం నిషేధం
- టెన్సెంట్ నుంచి హక్కులు వెనక్కి తీసుకున్న మాతృసంస్థ
- పబ్జీపై ఫిర్యాదులు ఉన్నాయన్న కేంద్రం
ఇటీవలే కేంద్రం పబ్జీపై నిషేధం విధించడంతో టెన్సెంట్ నుంచి పబ్జీ మాతృసంస్థ యాజమాన్య హక్కులను తిరిగి తీసుకుంది. దాంతో భారత్ లో పబ్జీ పునరాగమనానికి మార్గం సుగమం అయినట్టేనని అందరూ భావించినా, కేంద్రం మాత్రం దీనిపట్ల సుముఖంగా లేదు. పబ్జీ గేమ్ కోసం ఎందుకంత తొందర అంటూ కేంద్ర ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ప్రశ్నిస్తోంది.
గతంలో ఈ గేమ్ పై అనేక ఆరోపణలు వచ్చాయని, ఇది వ్యక్తుల్లో హింసాత్మక ప్రవృత్తిని ప్రేరేపించేదిగా ఉందని ఫిర్యాదులు కూడా అందాయని తెలిపింది. ఇప్పుడు యాజమాన్య హక్కులు మారినంత మాత్రాన పబ్జీ గేమ్ స్వభావంలో మార్పులేవీ రావు కదా అని పేర్కొంది.