ఏపీలో పరిణామాలను ఎప్పటికప్పుడు అధిష్ఠానం దృష్టికి తీసుకెళతా: పురందేశ్వరి
- బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పురందేశ్వరి
- అధిష్ఠానానికి కృతజ్ఞతలు తెలిపిన పురందేశ్వరి
- ఏపీ రాజధానిపైనా వ్యాఖ్యలు
దక్షిణ భారతదేశంలో బీజేపీని మరింత బలోపేతం చేయాల్సి ఉందని, ఏపీలో బీజేపీ అధికారంలోకి రావడానికి కృషి చేస్తానని తెలిపారు. ఏపీలో జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు అధిష్ఠానం దృష్టికి తీసుకెళతానని పురందేశ్వరి పేర్కొన్నారు. ఏపీ రాజధాని విషయంలో బీజేపీ స్పష్టమైన వైఖరితో ఉందని, మూడు రాజధానుల అంశంలో కేంద్రం పాత్ర పరిమితమని వివరించారు. దక్షిణాదిన ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న సమయంలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడం ఏమంత సులభం కాదని, అయితే ప్రజల పక్షాన నిలిచి వారిలో నమ్మకం కలిగిస్తామని అన్నారు.