Sunitha: నా మామయ్య భౌతికంగా లేరు.. అంతే: సునీత

Singer sunitha pays condolences to SP Balu
  • నా జీవితంలో వెలుగు నింపిన వ్యక్తి బాలు
  • పాట మీద ప్రేమ కల్పించారు
  • జీవితం మీద మమకారం పెంచిన ఆత్మబంధువు
గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరణంతో సినీ పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది. ముఖ్యంగా సంగీత కళాకారులు, గాయకులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. గాయని సునీత మాట్లాడుతూ, 'పాడుతా తీయగా' కార్యక్రమం ద్వారా ఎందరో గాయకులను బాలు తయారు చేశారని చెప్పారు.

ఛిద్రమైన తన జీవితంలో వెలుగు నింపిన వ్యక్తి బాలు అని తెలిపారు. పాట మీద ప్రేమ కల్పించారని, పాడాలనే తపనను పెంచారని చెప్పారు. జీవితం మీద మమకారాన్ని పెంచిన ఆత్మబంధువు అని తెలిపారు. తన మామయ్య భౌతికంగా మాత్రమే లేరని.. గుండెల్లో చిరస్థాయిగా ఉంటారని తెలిపారు.
Sunitha
Singer
SP Balasubrahmanyam
Tollywood

More Telugu News