Raja Singh: టీఆర్ఎస్ ఓడిపోతే పెన్షన్లు రావనడం ఓ భ్రమ... పెన్షన్లు ఆపే దమ్ము ఏ పార్టీకి లేదు: రాజాసింగ్

Raja Singh fires on TRS and CM KCR in the wake of Dubbaka by elections
  • దుబ్బాక ఉప ఎన్నికల నేపథ్యంలో రాజా సింగ్ వ్యాఖ్యలు
  • కేసీఆర్ ప్రజల రక్తం తాగుతున్నాడని విమర్శలు
  • జనం తలుచుకుంటే బీజేపీ గెలుపు తథ్యమన్న రాజా సింగ్
బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ దుబ్బాక ఉప ఎన్నికల నేపథ్యంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రజలు తలుచుకున్నారంటే దుబ్బాకలో బీజేపీ విజయం ఖాయమని అన్నారు. దుబ్బాక ఎన్నికల్లో డబ్బులు ఇస్తే తీసుకోవాలని, అయితే ఓటు మాత్రం బీజేపీకే వేయాలని పిలుపునిచ్చారు. బీజేపీ వద్ద డబ్బులు లేకపోయినా కావల్సినంత జనబలం ఉందని తెలిపారు. కార్యకర్తలు వీర సైనికుల్లా పనిచేసి బీజేపీ విజయానికి కృషి చేయాలని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఆయన టీఆర్ఎస్ పైనా, సీఎం కేసీఆర్ పైనా ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ ఓడిపోతే పెన్షన్లు రావని చెప్పడం ఓ భ్రమ అని, పెన్షన్లు ఆపే దమ్ము ఏ పార్టీకి లేదని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ ప్రజల రక్తం పీల్చుతున్నాడని విమర్శించారు.
Raja Singh
TRS
KCR
Pentions
Dubbaka

More Telugu News