SP Balasubrahmanyam: ఇక సెలవు.. బాలు అంత్యక్రియలు పూర్తి

sp balu last rituals
  • బాలుకి సినీ, రాజకీయ ప్రముఖుల నివాళులు
  • చెన్నై శివారులోని తామరైపాక్కం ఫాంహౌస్‌లో అంత్యక్రియలు
  • వైదిక శైవ సంప్రదాయం ప్రకారం అంతిమ క్రతువు
గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఆయనకు సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు అశ్రు నివాళులు అర్పించారు. చెన్నై శివారులోని తామరైపాక్కం ఫాంహౌస్‌లో అంతిమ సంస్కారాలు జరిగాయి. తమిళనాడు ప్రభుత్వ లాంఛనాలతో ఎస్పీ బాలు అంత్యక్రియలు నిర్వహించారు. బాలు కుమారుడు చరణ్‌, కుటుంబ సభ్యులు వైదిక శైవ సంప్రదాయం ప్రకారం అంతిమ క్రతువు నిర్వహించారు. బాలును కడసారి చూసేందుకు ప్రముఖులు, అభిమానులు పెద్ద ఎత్తున అక్కడకు వెళ్లారు. తమ అభిమాన గాయకుడికి కన్నీటి వీడ్కోలు పలికారు.

కాగా, కరోనా వైరస్ బారిన పడిన ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం గత నెల 5న ఆసుపత్రిలో చేరారు. ఆయనకు వైద్యులు వెంటిలేటర్ తో పాటు ఎక్మో సపోర్టుతో చికిత్స అందించారు. అప్పటి నుంచి ఆయన ఆరోగ్యం మెరుగుపడలేదు. నిన్న మధ్యాహ్నం ఆయన కన్నుమూశారు.
SP Balasubrahmanyam
Tamilnadu
channai

More Telugu News