Hyderabad: జూబ్లీహిల్స్ నుంచి మైండ్ స్పేస్ కు... 20 నిమిషాల ప్రయాణం ఇక 6 నిమిషాలే!

  • నిత్యమూ రద్దీగా ఉండే మార్గం
  • 6.5 కిలోమీటర్ల దూరం, ఇప్పుడు 2.5 కిలోమీటర్లే
  • సునాయాసంగా మైండ్ స్పేస్ వరకూ ప్రయాణం
Cable Bridge Reduced time to Travel between Jubileehills and Mindspace

హైదరాబాద్ లో నిత్యమూ అత్యంత రద్దీగా ఉండే మార్గాల్లో జూబ్లీహిల్స్ నుంచి మైండ్ స్పేస్ కు దారితీసే మార్గం కూడా ఉంటుంది. మొత్తం 6.5 కిలోమీటర్ల దూరం ఉండే ఈ మార్గంలో వెళ్లాలంటే, కనీసం 20 నిమిషాల సమయం పడుతుంది. ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయే వరకూ ఈ రహదారిలో గంటకు 30 కిలోమీటర్ల వేగానికి మించి వెళ్లే పరిస్థితి ఉండదు. అటువంటిది ఇప్పుడీ దూరం 2.5 కిలోమీటర్లకు తగ్గిపోయింది. ప్రయాణ సమయం కేవలం 6 నిమిషాలకు దిగివచ్చింది.

నిన్న రాత్రి దుర్గం చెరువుపై నిర్మించిన తీగల వంతెన జాతికి అంకితమైన సంగతి తెలిసిందే. దీంతో జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45లో ఫ్లయ్ ఓవర్ ఎక్కితే, నేరుగా మైండ్ స్పేస్ వరకూ సునాయాసంగా వెళ్లే అవకాశం హైదరాబాదీలకు దగ్గరైంది. ఈ బ్రిడ్జ్ పై వారాంతంలో మాత్రం వాహనాలను అనుమతించబోమని, సందర్శకుల కోసం తెరచి, ప్రత్యేక లైటింగ్ కార్యక్రమాలను చేపట్టి, టూరిజం స్పాట్ గా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి విదితమే.

.

More Telugu News