Bars: మందుబాబులకు గుడ్ న్యూస్.. తెలంగాణలో తెరుచుకోనున్న బార్లు!

TS Govt issues orders for opening of bars
  • బార్లు, క్లబ్బులు తెరవచ్చని ప్రభుత్వ ఉత్తర్వులు జారీ
  • తక్షణమే ఉత్తర్వులు అమల్లోకి వస్తాయన్న ప్రభుత్వం
  • పర్మిట్ రూమ్ లకు మాత్రం నో పర్మిషన్
మందు ప్రియులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కరోనా కారణంగా మార్చి 22న మూతపడ్డ బార్లు తెరుచుకోనున్నాయి. బార్లు, క్లబ్ లు తెరవవచ్చంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని పేర్కొంది. అయితే బార్లు, క్లబ్ లు కరోనా నిబంధనలను కచ్చితంగా పాటించాలని ఆదేశించింది. అయితే వైన్ షాపుల వద్ద పర్మిట్ రూమ్ లకు మాత్రం ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. అన్ లాక్ ప్రక్రియలో భాగంగా టీఎస్ ప్రభుత్వం క్రమంగా ఒక్కొక్కదానికి అనుమతి ఇస్తోంది.
Bars
Clubs
Telangana
Reopen

More Telugu News