రేపు సాయంత్రం రెడ్ హిల్స్ తామరైపాకంలో ఎస్పీ బాలు అంత్యక్రియలు

25-09-2020 Fri 15:42
Tomorrow will be SP Balasubrahmanyam funerals
  • అంత్యక్రియలకు ఏర్పాట్లు
  • బాలు పార్థివదేహం ఈ సాయంత్రం ఇంటికి తరలింపు
  • కోడంబాక్కంలో అభిమానుల సందర్శనకు అవకాశం!

యావత్ భారత సినీ జగత్తును, అభిమానులను విషాద సాగరంలో ముంచెత్తి ఇక సెలవంటూ మరో లోకానికి తరలి వెళ్లిన దిగ్గజ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అంత్యక్రియలు రేపు సాయంత్రం జరగనున్నాయి. తిరువళ్లూరు జిల్లా రెడ్ హిల్స్ ప్రాంతంలోని తామరైపాకంలో ఉన్న ఫాంహౌస్ లో బాలు అంత్యక్రియలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ఈ సాయంత్రం 4 గంటలకు ఎంజీఎం ఆసుపత్రి నుంచి బాలు పార్థివదేహాన్ని కోడంబాక్కంలోని వారి నివాసానికి తరలించనున్నారు. అభిమానుల సందర్శనార్థం కోడంబాక్కంలో బాలు భౌతికకాయాన్ని ఉంచుతారు. దీనిపై బాలు తనయుడు ఎస్పీ చరణ్ కాసేపట్లో ఓ ప్రకటన ద్వారా మరిన్ని వివరాలు తెలియజేసే అవకాశముంది.