SP Balasubrahmanyam: బాలు మృతిపై మహేశ్ బాబు, చరణ్ స్పందన!

Mahesh Babu and Charan pays condelences to SP Balu
  • బాలు లేరనే విషయాన్ని నమ్మలేకపోతున్నానన్న మహేశ్
  • ఆయనుకు ఎవరూ సాటి రాలేరని వ్యాఖ్య
  • షాక్ కు గురయ్యానన్న చరణ్
ఎస్పీ బాలు మరణంతో యావత్ దేశం షాక్ కు గురైంది. ఆయన మరణాన్ని ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. సినీ ప్రముఖులు ఆయనతో ఉన్న అనుబంధాలను గుర్తు చేసుకుంటూ, సంతాపాన్ని ప్రకటిస్తున్నారు. మహేశ్ బాబు స్పందిస్తూ... బాలుగారు ఇక లేరనే విషయాన్ని నమ్మలేకపోతున్నానని చెప్పాడు. ఆయనకు మరే గాయకుడు సాటి రాలేరని అన్నాడు. తమ గుండెల్లో మీరు చిరస్థాయిగా నిలిచిపోతారని అన్నాడు. బాలుగారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానని చెప్పాడు. ఆయన కుటుంబానికి సంతాపం ప్రకటించాడు.

రాంచరణ్ స్పందిస్తూ... ఎప్పుడూ చిరునవ్వులు చిందిస్తూ ఉండే బాలుగారు మరణించారనే వార్తతో షాక్ కు గురయ్యానని చెప్పాడు. ఆయన లేని లోటును పూడ్చలేమని ఆవేదన వ్యక్తం చేశాడు. వారి కుటుంబ సభ్యులకు సంతాపాన్ని తెలియజేస్తున్నానని చెప్పాడు.
SP Balasubrahmanyam
Mahesh Babu
Ramcharan
Tollywood

More Telugu News