Nellore District: నెల్లూరు జిల్లాలో దారుణం.. ఆంజనేయస్వామి విగ్రహం ధ్వంసం

Hanuman statue damaged in Nellore district
  • నాయుడుపేట పంచాయతీలో ఘోరం
  • ఆంజనేయస్వామి తల, తోకను డ్యామేజ్ చేసిన దుండగులు
  • తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న స్థానికులు
ఏపీలో హిందూ  దేవాలయాలపై జరుగుతున్న వరుస దాడులు కలకలం రేపుతున్నాయి. ఈ దాడులపై తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నప్పటికీ తాజాగా మరో ఘటన చోటుచేసుకుంది. నెల్లూరు జిల్లా నాయుడుపేట పంచాయతీలోని తుమ్మూరు ప్రాంతంలో ఆంజనేయస్వామి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. 10 అడుగుల ఎత్తున్న ఈ విగ్రహం తల, తోక భాగాన్ని దుండగులు ధ్వంసం చేశారు. విగ్రహం ధ్వంసమైన వార్త బయటకు పొక్కగానే కలకలం రేగింది. హిందువులు అక్కడకు చేరుకుని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి పోలీసు బృందంతో అక్కడకు చేరుకున్నారు. డాగ్ స్క్వాడ్ ను రప్పిస్తున్నారు.
Nellore District
Hanuman Statue
Damage
Naidupet

More Telugu News