గుండు గెటప్ ఏ చిత్రం కోసమో చెప్పిన చిరంజీవి

25-09-2020 Fri 11:02
  • గుండు ఫొటోను షేర్ చేసిన చిరంజీవి
  • చర్చనీయాంశంగా మారిన గుండు గెటప్
  • 'వేదాళం' రీమేక్ కోసం కొత్త గెటప్ ట్రై చేసినట్టు తెలిపిన చిరంజీవి
Chiranjeevi gives clarity on his new bald look
ఇటీవల సోషల్ మీడియాలో చిరంజీవి పెట్టిన ఒక పోస్ట్ సంచలనం రేపింది. గుండు గెటప్ తో ఉన్న ఫొటోను ఆయన షేర్ చేయగానే జనాలు షాక్ కు గురయ్యారు. అది ఒరిజినల్ గుండా? లేక ఆ విధంగా మేకప్ వేసుకున్నారా? అనే చర్చ పెద్ద ఎత్తున సాగింది.

దీనిపై చిరంజీవి క్లారిటీ ఇచ్చారు. 'వేదాళం' సినిమా కోసమే గుండు లుక్ ను ట్రై చేసినట్టు ఆయన తెలిపారు. అయితే, ఈ లుక్ ఇంకా ఫైనలైజ్ కాలేదని చెప్పారు. ప్రస్తుతం కొరటాల శివ తెరకెక్కిస్తున్న 'ఆచార్య' సినిమాలో చిరంజీవి నటిస్తున్నారు.