సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

25-09-2020 Fri 07:25
Pooja Hegde says she can not wait for Radhe Shyam shoot
  • 'రాధే శ్యామ్'పై ట్వీట్ చేసిన పూజ హెగ్డే 
  • రాజకీయ నాయకుడిగా సూర్య
  • నెగటివ్ పాత్రలో మలయాళ భామ  

*  'రాధే శ్యామ్' సినిమా షూటింగ్ కోసం ఇక ఆగలేకున్నానని అంటోంది కథానాయిక పూజ హెగ్డే. అలాగే 'ఈసారి ఈ చిత్రం సెట్స్ లో రెండు బర్త్ డే లు' ఉంటాయని ఈ చిన్నది ట్వీట్ చేసింది. అంటే అక్టోబర్ 13న పూజ బర్త్ డే కాగా, అక్టోబర్ 23న ప్రభాస్ జన్మదినం. వీటిని దృష్టిలో పెట్టుకునే పూజ ఇలా కామెంట్ చేసిందన్న మాట. అన్నట్టు 'రాధే శ్యామ్' షూటింగ్ అక్టోబర్ మొదటి వారం నుంచి జరుగుతుంది.
*  తమిళ చిత్ర కథానాయకుడు సూర్య మరోసారి రాజకీయ నాయకుడి పాత్రలో నటించనున్నాడు. పాండిరాజ్ దర్శకత్వంలో సూర్య హీరోగా ఓ చిత్రం రూపొందనుంది. విజయదశమికి షూటింగును ప్రారంభించుకునే ఈ చిత్రంలో సూర్య రాజకీయ నాయకుడిగా నటిస్తాడట. గతంలో 'ఎన్.జి.కె' చిత్రంలో ఇలా రాజకీయ నాయకుడి పాత్రలో కనిపించాడు.
*  మలయాళ ముద్దుగుమ్మ పూర్ణ ఓ తెలుగు సినిమాలో నెగటివ్ టచ్ తో కూడిన పాత్రను పోషిస్తోంది. రాజ్ తరుణ్ హీరోగా కొండా విజయకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రంలో పూర్ణ ఓ కీలకమైన పాత్రను పోషిస్తోందని, ఇది నెగటివ్ టచ్ తో సాగుతుందని తెలుస్తోంది.