kannada: డ్రగ్స్ కేసు.. కన్నడ టీవీ యాంకర్ అనుశ్రీకి సీసీబీ నోటీసులు

CCB Police gave notices to kannada anchor Anushree over Drugs case
  • పోలీసుల అదుపులో  ఉన్న డ్యాన్సర్ కిశోర్‌శెట్టి
  • అతడిచ్చిన సమాచారంతోనే అనుశ్రీకి నోటీసులు
  • అతడితో తనకు ఎటువంటి సంబంధం లేదన్న యాంకర్
శాండల్‌వుడ్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన డ్యాన్సర్ కిశోర్‌శెట్టి ఇచ్చిన సమాచారంతో కన్నడ టీవీ యాంకర్ అనుశ్రీకి మంగళూరు సీసీబీ అధికారులు నిన్న నోటీసులు జారీ చేశారు. బెంగళూరులో స్థిరపడిన అనుశ్రీ సినిమాల్లోనూ నటిస్తోంది. తనకు సీసీబీ అధికారులు నోటీసులు ఇవ్వడంపై అనుశ్రీ స్పందించింది. కిశోర్‌శెట్టికి, తనకు ఎటువంటి సంబంధం లేదని, పదేళ్ల క్రితం అతడితో కలిసి డ్యాన్స్ చేశాను తప్పితే అంతకుమించి అతడితో పరిచయం లేదని స్పష్టం చేసింది. కాగా, బెంగళూరులోని కాలేజీల వద్ద కార్తీక్‌శెట్టి అనే వ్యక్తితో కలిసి కిశోర్ శెట్టి డ్రగ్స్ విక్రయించేవాడని విచారణలో తేలింది. దీంతో విచారణ కోసం అతడిని బెంగళూరుకు తీసుకురానున్నారు.  

మరోవైపు, అరెస్ట్ అయిన నిందితులు ఇచ్చిన వివరాల ఆధారంగా బెంగళూరు నుంచి గోవా, మంగళూరుకు డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముఠాను సీసీబీ అధికారులు గుర్తించారు. ముఠా నాయకుడి కోసం గాలింపు మొదలుపెట్టారు. అతడికి మాఫియాతోనూ సంబంధాలు ఉన్నట్టు గుర్తించిన పోలీసులు అతడి పేరును మాత్రం వెల్లడించలేదు.
kannada
Anchor Anushree
CCB Police
Drugs
Sandalwood

More Telugu News