రఘురామకృష్ణరాజు సెక్యూరిటీ దుర్వినియోగానికి పాల్పడుతున్నారు: లోక్ సభ స్పీకర్ కు నందిగం సురేశ్ ఫిర్యాదు

24-09-2020 Thu 19:31
YCP MP Nandigam Suresh complains to Lok Sabha Speaker Om Birla on Ragjurama Krishna Raju
  • కులం పేరిట దూషిస్తున్నారని ఆరోపణ
  • రఘురామకృష్ణరాజుకు భద్రత తొలగించాలని స్పీకర్ కు విజ్ఞప్తి
  • స్పీకర్ కు వినతి పత్రం అందజేత

ఇటీవల ఓ మీడియా సమావేశంలో నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు చేసిన వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో మండిపడుతున్న బాపట్ల వైసీపీ ఎంపీ నందిగం సురేశ్ తాజాగా లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు ఫిర్యాదు చేశారు. సెక్యూరిటీని అడ్డంపెట్టుకుని ఎస్సీ వర్గాలను బెదిరిస్తున్నారని ఆరోపించారు. అసభ్య పదజాలంతో దూషిస్తున్నారని, స్పీకర్ కు తెలిపారు.

కులం పేరిట కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తున్నారని, ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. కేంద్రం కల్పించిన భద్రతను దుర్వినియోగం చేస్తున్నారని, ఆయనకు భద్రతను తొలగించాలని తెలిపారు. ఈమేరకు నందిగం సురేశ్ లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు విజ్ఞాపన పత్రం అందించారు. దీనికి సంబంధించిన ఫొటోలను ఆయన ట్విట్టర్ లో పంచుకున్నారు. రఘురామకృష్ణరాజుపై లోక్ సభ స్పీకర్ కు ఫిర్యాదు చేశానని తెలిపారు.