కృష్ణానదిలో కొనసాగుతున్న భారీ వరద!
- 8 గేట్లు 10 అడుగుల మేరకు ఎత్తివేత
- 2.10 లక్షల క్యూసెక్కులకు పైగా ఇన్ ఫ్లో
- వరద మరింతకాలం కొనసాగవచ్చన్న అధికారులు
ప్రస్తుతం ఇన్ ఫ్లో 2.10 లక్షల క్యూసెక్కులకు పైగా ఉండగా, 2.52 లక్షల క్యూసెక్కుల నీటిని వదులుతున్నామని, నీటిమట్టం 884.20 అడుగులుగా ఉందని వెల్లడించారు. జలాశయంలో 210 టీఎంసీల నీటి నిల్వ ఉందని అన్నారు. మరోవైపు నాగార్జున సాగర్ కు చెందిన 14 గేట్లను ఎత్తిన అధికారులు, 2.40 లక్షల క్యూసెక్కుల నీటిని పులిచింతల, ప్రకాశం బ్యారేజ్ మీదుగా సముద్రంలోకి వదులుతున్నారు.