తెలంగాణలో ఏసీబీకి చిక్కిన మరో పోలీసు అధికారి.. ఏకకాలంలో పలు జిల్లాల్లో సోదాలు

23-09-2020 Wed 13:14
acb rides in acp home
  • ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్న మల్కాజ్‌గిరి ఏసీపీ 
  • నరసింహారెడ్డి నివాసాల్లో తనిఖీలు
  • ల్యాండ్ సెటిల్మెంట్లు, భూ వివాదాల్లో ఉన్న ఏసీపీ 

తెలంగాణలో మరో భారీ అవినీతి పోలీసధికారి ఏసీబీ అధికారులకు చిక్కాడు. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్న కేసులో మల్కాజ్‌గిరి ఏసీపీ నరసింహారెడ్డి నివాసంపై ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. గతంలో ఆయన ఉప్పల్ సీఐగానూ పని చేశారు. ఆయన పలు ల్యాండ్ సెటిల్మెంట్లు, భూ వివాదాల్లో ఉన్నట్లు సమాచారం.

ఈ నేపథ్యంలో నరసింహారెడ్డితో పాటు అతని కుటుంబీకుల ఇళ్లల్లోనూ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాదుతో పాటు పలు జిల్లాల్లో అధికారులు ఒకే సమయంలో తనిఖీలు చేస్తున్నారు. వరంగల్‌ జిల్లాలో 3 ప్రాంతాల్లో, కరీంనగర్‌, నల్లగొండ జిల్లాల్లో, ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురంలో ఒక చోట అధికారులు సోదాలు కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది.