Anitha: డిక్లరేషన్ ఇచ్చాకే సీఎం పట్టు వస్త్రాలను సమర్పించాలి: టీడీపీ నాయకురాలు అనిత

Jagan has to sing the declaration says Anitha
  • వెంకన్నపై విశ్వాసం ఉందని డిక్లరేషన్ ఇవ్వాలి
  • 1860 నుంచి డిక్లరేషన్ ఇచ్చే నిబంధన ఉంది  
  • కొడాలి నాని తన పేరు మార్చుకోవాలి

ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై టీడీపీ మాజీ ఎమ్మెల్యే అనిత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తిరుమల వేంకటేశ్వరస్వామి జోలికి వెళ్లవద్దని చెప్పారు. వెంకన్నపై విశ్వాసం ఉందని డిక్లరేషన్ ఇచ్చిన తర్వాతే ఆయన ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలను సమర్పించాలని అన్నారు. 1860 నుంచి డిక్లరేషన్ ఇచ్చే నిబంధన టీటీడీలో ఉందని చెప్పారు. బ్రిటీష్ పాలకులు సైతం ఈ నిబంధనను అనుసరించారని తెలిపారు.

మంత్రి జయరాం కుమారుడి బెంజ్ కారు వ్యవహారంపై ప్రజల దృష్టిని మరల్చేందుకే ప్రభుత్వం కొత్త వివాదానికి తెరలేపిందని చెప్పారు. హిందువులైన మంత్రులు సైతం ముఖ్యమంత్రి మన్ననలు పొందేందుకు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. హిందూ ధర్మాలపై నమ్మకం లేని మంత్రి కొడాలి నాని తన పేరును మార్చుకోవాలని సూచించారు. మరోవైపు, ఈ సాయంత్రం జగన్ తిరుమలకు చేరుకోనున్న విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News