ఈ జీన్స్ ప్యాంట్ ధర రూ.88 వేలు... బ్రాండ్ మహిమ!

22-09-2020 Tue 20:28
  • ఎకో ఫ్రెండ్లీ జీన్స్ రూపొందించిన గుస్చి 
  • ప్యూర్ ఆర్గానిక్ కాటన్ తో జీన్స్ తయారీ
  • జీన్స్ పై పచ్చగడ్డి షేడ్
Gucci brings eco friendly jeans at high cost
ఫ్యాషన్ ప్రపంచంలో 'గుస్చి' అంటే తిరుగులేని బ్రాండ్ అని చెప్పాలి. ఇటలీకి చెందిన ఈ లగ్జరీ బ్రాండ్ ఎప్పటికప్పుడు ట్రెండ్ ను ఫాలో అవుతూ సెలబ్రిటీ వర్గాల్లో నెంబర్ వన్ గా పేరు తెచ్చుకుంది. ఈ సంస్థ తాజాగా తీసుకువచ్చిన ఎకో ఫ్రెండ్లీ జీన్స్ ఇప్పుడు హైఎండ్ మార్కెట్లో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. దీని ధర రూ.88 వేల నుంచి రూ.1.20 లక్షల వరకు ఉంటుందట.

స్వచ్ఛమైన ఆర్గానిక్ డెనిమ్ జీన్స్ పేరిట ఈ ప్యాంట్స్ ను గుస్చి విక్రయిస్తోంది. ఆర్గానిక్ కాటన్ తో తయారైన ఈ జీన్స్ పై కొద్దిగా పచ్చగడ్డి వేసి రుద్ది కొత్త షేడ్ తీసుకువచ్చారు. గుస్చి ఫాల్ వింటర్ కలెక్షన్ లో భాగంగా వీటిని విక్రయాలకు ప్రదర్శిస్తున్నారు.